ఇక కేటీఆర్  ‘మన నగరం’ ములాఖతులు - MicTv.in - Telugu News
mictv telugu

ఇక కేటీఆర్  ‘మన నగరం’ ములాఖతులు

December 4, 2017

హైదరాబాద్ నగరంలోని సమస్యలు, సవాళ్ళను నేరుగా తెలుసుకునే చర్య దిశగా తెలంగాణ ప్రభుత్వం ఓ నూతన కార్యాచరణకు  శ్రీకారం చుట్టింది. ‘ మన నగరం – అప్నా షెహర్ ’ పేరుతో నగరంలో టౌన్‌హాలు సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. నగరంలో సర్కిళ్ల వారీగా ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు, ఎన్జీవోలతో నేరుగా చర్చించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజల ప్రాధాన్య అంశాలపై టౌన్‌హాలు వేదికగా చర్చిస్తామని ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమం నగరాభివృద్ధికి ఎంతో తోడ్పాటునందిస్తుందని అభిప్రాయపడ్డారు.

‘ మన నగరం ’ పేరుతో పాటు అందులో చార్మినార్ ఉన్న లోగోలను మంత్రి ఈ సందర్భంగా తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.