ఈ ట్రాఫిక్ పోలీస్‌కు సెల్యూట్! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ ట్రాఫిక్ పోలీస్‌కు సెల్యూట్!

January 31, 2018

అతనో ట్రాఫిక్ కానిస్టేబుల్ హైద్రాబాద్‌లోని పురానాపుల్ బ్రిడ్జి వద్ద విధులు నిర్వహిస్తుంటాడు. నిత్యం రద్దీగా ఉండే రోడ్లను క్లియర్ చేస్తూ వాహనాలను సక్రమమైన పద్దతిలో పంపిస్తూ ఉంటాడు. ఈరోజు కూడా అలాగే విధులు నిర్వహిస్తున్నాడు. అయితే రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ పెద్దమనిషి ఒక్కసారిగా కుప్పకూలాడు. ఏమైందో అంటూ అందరూ గుమిగూడి ఫోటోలు వీడియోలు తీస్తూ సినిమా చూస్తున్నారు. ఆ పెద్దమనిషి సృహ తప్పి పడిపోయాడు.

అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడకు వచ్చి వెంటనే అంతని గుండెపై వొత్తుతూ ఓ డాక్టర్ లా అతనికి ప్రాణం పోశాడు. కానిస్టేబుల్ అలా చేయడంవల్ల వెంటనే  ఆ పెద్దాయన సృహలోకి వచ్చాడు. వెంటనే అతనిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసిన ఆ పనిని చుట్టు ఉన్నవారు చప్పట్లు కొడుతూ మెచ్చుకున్నారు. మానవత్వమున్న పోలీస్ అని అందరూ శభాష్ అంటున్నారు.