ట్రాఫిక్ యమధర్మరాజు! - MicTv.in - Telugu News
mictv telugu

ట్రాఫిక్ యమధర్మరాజు!

October 30, 2017

ట్రాఫిక్ పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉంటారు. జరిమానాలు, జైలు శిక్షలు పనిచేయడం లేదు. దీంతో వారిని భయపెట్టేందుకు తెలంగాణ పోలీసులు ఏకంగా యమధర్మరాజునే పట్టుకొచ్చారు.  వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలంటూ ఆయన బొమ్మతో ఒక పోస్టర్ తయారు చేశారు. దీన్ని తెలంగాణ డీజీపీ విడుద చేశారు. ‘హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా ట్రాఫిక్  పోలీసు దగ్గర నుంచి తప్పించుకోగలరేమో , కానీ నా దగ్గర నుంచి కాదు’ అని యముడు ఇందులో హెచ్చరిస్తున్నాడు. ఇదివరకు ఏపీ పోలీసులు కూడా రావణాసురుడిని బొమ్మను ఇలా వాడుకున్నారు. రావణాసురుడికి పది తలకాయలు ఉన్నాయి, మీకు ఒక్క తలే ఉంది అని వాహనదారులను భయపెడుతూ హోర్డింగులు పెట్టారు.