పోలింగ్‌లో విషాదం.. ఇవే వారికి చివరి ఓట్లు… - MicTv.in - Telugu News
mictv telugu

పోలింగ్‌లో విషాదం.. ఇవే వారికి చివరి ఓట్లు…

December 7, 2018

తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రం పోలింగ్ విషాదాంతం అయింది. ఇవే నా చివరి ఓట్లు అన్నట్టు ఇద్దరు వేర్వేరు చోట్లలో ఆకస్మికంగా చనిపోయారు.  వరంగల్ అర్బన్ జిల్లా భీమారం మండలం పైడిపల్లి పోలింగ్ బూత్లోనే అదే గ్రామానికి చెందిన స్వామి (55) కుప్పకూలిపోయాడు. గమనించిన సిబ్బంది వెంటనే అతణ్ణి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఓటు వేయకుండానే స్వామి మృతి చెందడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అతని మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

Telugu news Tragedy in polling ..These are the last votes for them ….

ఇదిలావుండగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలోనూ ఈ తరహా ఘటనే చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు వచ్చిన నర్సింహ అనే వృద్ధుడు గుండెపోటుతో కన్నుమూశాడు. గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు ఓటు వేసేందుకు వచ్చాడు. వరుసలో నిలబడ్డాడు. ఇంతలో నర్సింహకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో కుప్పకూలిపోయిన అతణ్ణి చూసి పక్కనే ఉన్నవారు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే అతడు మృతిచెందాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్న వేళ ఇద్దరు మృతిచెందడం విషాదాన్ని నింపింది. మధ్యాహ్నం 12 గంటలకు వరకు 30శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది.

Telugu news Tragedy in polling ..These are the last votes for them …