రంగారెడ్డిలో కూలిన విమానం - MicTv.in - Telugu News
mictv telugu

రంగారెడ్డిలో కూలిన విమానం

November 21, 2018

హైదరాబాద్ నగర శివారులోని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మొకిల గ్రామంలో ఒక ట్రైనింగ్ విమానం కుప్పకూలింది. విమానం పొలాలలో కూలడంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ట్రైనింగ్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. వెంటనే గ్రహించిన పైలట్ అప్రమత్తమై అందులోనుంచి దూకేశాడు. పైలట్ కూడా సురక్షితంగా ఉన్నాడని స్థానికులు తెలియజేశారు. పెద్ద శబ్దం రావడంతో అక్కడికి చేరుకున్నామని, వచ్చి చూస్తే విమానమని స్థానికులు తెలిపారు. ఈ సంఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.Telugu News Trainee flight crashed in rangareddy district pilot safeTelugu News Trainee flight crashed in rangareddy district pilot safe