ఆడోళ్లు జీన్స్ ధరిస్తే హిజ్రాలు పుడతారు - MicTv.in - Telugu News
mictv telugu

ఆడోళ్లు జీన్స్ ధరిస్తే హిజ్రాలు పుడతారు

April 4, 2018

పిల్లలు ట్రాన్స్జెండర్లుగా మారటానికి వారి తల్లిదండ్రులే కారణం అని కేరళ ప్రొఫెసర్ రంజిత్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు జీన్స్ వేసుకుంటే వారికి పుట్టబోయే పిల్లలు ట్రాన్స్‌జెండర్లు అవుతారని  అన్నారు. పిల్లలు ట్రాన్స్‌జెండర్లుగా మారడం, ఆటిజంతో బాధపడం వంటివన్నీ వారి తల్లిదండ్రుల చలవే అన్నారు. అంతటితో ఆగకుండా ఓ వీడియోను ఉదాహరణగా చూపారు రంజిత్. అందులోని పిల్లలు ఆటిజం బారిన పడటానికి వారి తల్లులు జీన్స్ వేసుకోవడమేనని చెప్పారు.ఈ అశాస్త్రీయ వ్యాఖ్యలను పలువురు ఖండించారు. రంజిత్‌ను ఏ ప్రభుత్వ శాఖలు, సంస్థలు తమ కార్యక్రమాలకు ఆహ్వానించరాదని కేరళ విద్యాశాఖ మంత్రి కేకే శైలజ ఆదేశించారు నిరాధార ఆరోపణలు చేస్తూ పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారని.. ఓ బాధ్యతగల వ్యక్తి అయివుండి ఇలా మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం అంటూ మహిళా సంఘాలు విమర్శలు కురిపిస్తున్నాయి. . అయితే ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రంజిత్‌కు కొత్తేమీ కాదు. గతంలో పలుమార్లు మహిళలపై ఆయన వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. తాను చేసే ప్రసంగాలను తనకున్న యూట్యూబ్ ఛానళ్ళో అప్‌లోడ్ చేసుకుంటారట రంజిత్.