కొనసాగుతున్న దేశవ్యాప్త బంద్.. స్తంభించిన జనజీవనం

కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మికులకు సంబంధించి చేపడుతున్న ఏకపక్ష కార్మిక చట్టాల సంస్కరణలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు రెండు రోజుల భారత్‌ బంద్‌‌కు పిలుపునిచ్చాయి. దీంతో ఈరోజు, రేపు బంద్ చేపడుతున్నాయి. పది కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కార్మికులు నేడు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. కార్మికుల సమ్మెతో దేశవ్యాప్తంగా పలు చోట్ల జన జీవనం స్తంభించింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో సమ్మెకు దిగిన సీపీఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలో కార్మికులు రోడ్లపైకి చేరి ఆందోళన చేపట్టారు. టైర్లకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.Telugu News transport strike hits life in Bangalore, Mumbai, kolkata. Bus services affectedమహారాష్ట్రలో బృహన్ముంబయి ఎలక్ట్రిసిటీ సప్లయ్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ చేపట్టిన బంద్‌తో ముంబయి వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కేరళలోనూ పలు చోట్ల కార్మికులు సమ్మె చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీలోను పలు కార్మిక సంఘాలు రోడ్లపై ఆందోళన చేపట్టాయి. మరోవైపు కార్మిక సంఘాల సమ్మెకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగుల సంఘాలు, దేశవ్యాప్తంగా రైతులు కూడా మద్దతు పలికారు. కార్మికుల సమ్మెకు మద్దతుగా జనవరి 8,9 తేదీల్లో తాము సమ్మె చేపట్టనున్నట్లు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలకు అంతరాయం కలగనుంది.