80 భాషలు మీ సొంతం 

రవాణా సౌకర్యాల విస్తరణ, ఉద్యోగావకాశాలు బాగా పెరిగిన ఈ రోజుల్లో పక్క రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లడం కొత్త విషయమేమీ కాదు. హిందీ, ఇంగ్లీష్‌లలో సులువుగా మాట్లాడేయవచ్చు. కాని రష్యన్,  కొరియా, చైనీస్ వంటి  దేశాలకు వెళ్లినప్పుడు భాష రాక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ ఇబ్బందులు త్వరలో తీరనున్నాయి. మన దగ్గర ఇట్రావిస్ పర్సనల్ ట్రాన్స్‌లేటర్ అనే పరికరం  ఈ సమస్యలకు చిటికెలో పరిష్కారం దొరుకుంతుంది. ఈ డివైస్  ప్రపంచంలోని 80 భాషలను మనకు కావాల్సిన భాషలోకి తర్జుమా చేస్తుంది. దీనిని ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయాలి. ఆన్ లైన్‌లో కూడా 23 భాషలకు సంబంధించిన ముచ్చట్లు వినవచ్చు. సెల్ ఫోన్ మాదిరిగా ఉన్న దీనిలో భాషల తర్జుమాకు అవసరమైన బటన్లు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి.

SHARE