సియం అయ్యుండి..సింపుల్‌గా బ్రతుకుతున్నాడు...హ్యాట్సాఫ్ ! - MicTv.in - Telugu News
mictv telugu

సియం అయ్యుండి..సింపుల్‌గా బ్రతుకుతున్నాడు…హ్యాట్సాఫ్ !

January 30, 2018

ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఆయన జీవితం ఎలా ఉంటుంది. విలాసవంతమైన భవనాలు, ఖరీదైన కార్లు ఇలా ఎన్నో ఎన్నో సౌకర్యాలు ఉంటాయి. కానీ ఈ ముఖ్యమంత్రి రూటే వేరు.

భారతదేశంలోనే  అత్యంత పేద ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?  త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్(69).  సోమవారం ఆయన శాసనసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. అందులో ఆయన రూ.1,520లుగా తన ఆస్తిగా చూపారు. ఈ నెల 20తేదిన నాటికి ఆయన బ్యాంకు అకౌంటులో కేవలం రూ.2,410లు మాత్రమే ఉన్నాయి. 2013లో ఎన్నికల సమయంలో కూడా ఆయన బ్యాంకు ఖాతాలో రూ. 9,720 మాత్రమే ఉన్నాయి.తన నామినేషన్‌లో 0.0018 ఎకరాల వ్యవయేతర భూమి అగర్తలో ఉందని మాణిక్ తెలిపారు. ఈయనకు మొబైల్ ఫోన్ కూడా లేదు. అంతేకాదు కనీసం ఈ-మెయిల్ కూడా లేదు. ఆయన భార్య అగర్తలో తరుచూ రిక్షాలో ప్రయాణిస్తూ కనిపిస్తారు.

1998 నుంచి మాణిక్  త్రిపుర ముఖ్యమంత్రిగా  పని చేస్తున్నారు.  ఈ ఎన్నికల్లో ఆయన ధన్ పూర్ నియెజకవర్గం నుంచి పోటీలోకి దిగుతున్నారు.ఆయనకు సర్కార్ ఇచ్చే వేతనం రూ. 26,315 మొత్తాన్ని పార్టీ నిధికి ఇస్తాడు. ఇలా  పార్టీకి తన వేతనం ఇస్తున్నందున  ఆయనకు  నెలకు పార్టీ రూ. 9,700లను అలవెన్స్ గా ఇస్తుంది.