త్రిపురలో లెనిన్  విగ్రహం కూల్చివేత... - MicTv.in - Telugu News
mictv telugu

త్రిపురలో లెనిన్  విగ్రహం కూల్చివేత…

March 6, 2018

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుబడిన 48 గంటలకే , కమ్యూనిస్టు నేత లెనిన్ విగ్రహాన్ని జేసీబీతో కూల్చేశారు. త్రిపురలోని బెలోనియా పట్టణంలో లెనిన్‌గా ప్రసిద్దుడైన వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యొనోవ్ విగ్రహన్ని త్రిపురలో సీపీఎం పాలన 21ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్బంలో ఏర్పాటు చేశారు. అయితే, తాజా ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో ఈ విగ్రహాన్ని కొందరు జేసీబీతో కూల్చేశారు. కొందరు కాషాయ దుస్తులు, టోపీలు ధరించి  ‘ భారత్‌మతాకీ జై ’ నినాదాలు చేస్తుండగా ఈ విగ్రహాన్ని జేసీబీతో కూల్చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా ఏఎన్‌ఐ ట్వీట్‌ చేసింది. కొందరి ‘ కమ్యూనిస్టు ఫోబియో ’కు ఈ ఘటన నిదర్శనమని సీపీఎం విమర్శింస్తోంది. వామపక్ష పాలనలో అణచివేయబడ్డ ప్రజలే ఆ విగ్రహాన్ని కూల్చేశారని బీజేపీ నేతలు సీపీఎం నేతలపై విమర్శలు చేస్తున్నారు. త్రిపురలో బీజేపీ గెలిచిన అనంతరం ఆ పార్టీ కార్యకర్తలు సీపీఎం కార్యాలయాలపై దాడులు చేసి విధ్వంసానికి దిగుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నేతల సహకారంతో ఆ పార్టీ శ్రేణులు  సీపీఎం కార్యకర్తలు, నాయకులే లక్ష్యంగా దాడులకు దిగితూ హింసకు పాల్పడుతున్నారని, త్రిపురలో బీజేపీ శ్రేణులు రౌడీయిజానికి పాల్పడుతున్నారని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.