ఇవాంకాపై తండ్రి ప్రశంసల జల్లు... - MicTv.in - Telugu News
mictv telugu

ఇవాంకాపై తండ్రి ప్రశంసల జల్లు…

November 29, 2017

గ్రేట్ వర్క్ ఇవాంకా ’ అంటూ తన ముద్దుల తనయను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ ఖాతాలో పొగడ్తలతో ముంచెత్తాడు. హైదరాబాద్‌లో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న తన కుమార్తె చేసిన ప్రసంగంపై ప్రశంసల జల్లు కురిపించారు.  

అమెరికన్లు తమ కలలను సాకారం చేసుకునే దిశగా తమ ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామిక విధానాన్ని ఎంతో ప్రోత్సహిస్తోందని జీఈఎస్ ప్రారంభ ఉపన్యాసంలో ఇవాంకా వ్యాఖ్యానించిన  విషయం తెలిసిందే. ఆమె మాట్లాడిన ఆ 20 సెకెన్ల వీడియోను యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ సోషల్  పోస్టు చేయగా ట్రంప్ పై విధంగా స్పందించారు. తన కుమార్తె ప్రసంగానికి ముగ్దుడైన ట్రంప్ కూతురిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.