రేవంత్‌కు ఝలక్..కేటీఆర్ కౌంటర్ అదిరింది - MicTv.in - Telugu News
mictv telugu

రేవంత్‌కు ఝలక్..కేటీఆర్ కౌంటర్ అదిరింది

November 25, 2017

ఆఫ్ ద రికార్డ్ అంటూ కేటీఆర్ బామ్మర్ధికి డ్రగ్స్,పబ్స్‌తో సంబంధం ఉందని మీడియాకు లీకిచ్చిన రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ గట్టి సమాధానాన్నే ఇచ్చింది. ‘ఛలో దేఖ్ లేంగే  కోర్టులో’ అంటూ రేవంత్‌రెడ్డికి  లీగల్ నోటీసులను జారీ చేసింది. టీఆర్ ఎస్ ఈ ఎత్తుగడతో రేవంత్ నోటికి తాళం వేయాలని అనుకుంటోంది.  

రెండు రోజుల క్రితం రేవంత్ మీడియాతో చిట్ చాట్ చేస్తూ ‘కేటీఆర్ బామ్మర్ధి పాకాల రాజేంద్రప్రసాద్ నిర్వహించే ‘ఈవెంట్ నౌ’ అనే సంస్థకు,డ్రగ్స్ కేసుకు సంబంధం ఉంది కాబట్టే, డ్రగ్స్ కేసు మూత పడింది. కేసీఆర్  కుటుంబానికి చెందినవారే డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు’ అని వ్యాఖ్యలు చేశాడు. అయితే రేవంత్ చేసిన వ్యాఖ్యలపై  కేటీఆర్ బామ్మర్ధి రాజేంద్రప్రసాద్  రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు.

‘వ్యాపారానికి సంబంధించి అసత్య ఆరోపణలు చేయడంతో పాటు రేవంత్, ప్రభుత్వ పెద్దల పరువుతీస్తున్నాడని, వెంటనే రేవంత్ రెడ్డి మీడియా సమక్షంలో  క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని రాజేంద్రప్రసాద్ నోటీసుల్లో వెల్లడించారు. అంతేకాదు రేవంత్ పై  పరువునష్టం దావా వేస్తానని కూడా తెలిపారు.