మోదీకి ఓ రోగం ఉంది.. వారిని దంచండి.. కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

మోదీకి ఓ రోగం ఉంది.. వారిని దంచండి.. కేసీఆర్

November 21, 2018

తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. విపక్షాలపై దుమ్మెత్తి పోస్తున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆయన ఈ రోజు దేవరకొండ, నకిరేకల్, మెదక్‌లలో జరిగిన ప్రజాశీర్వాద సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు మోదీని కూడా విమర్శించారు. మోదీ, హిందూ ముస్లింల మధ్య తేడా చూపుతారని, బాబుతో తెలంగాణకు పెను ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Telugu news TRS chief Telangana CM KCR blame PM Modi for discrimination between hindu and mulsims and warns state about Chandrababu.

‘మోదీకి హిందూ, ముస్లిం అనే రోగం ఉంది.. ఎస్టీ, ముస్లింల రిజర్వేషన్లపై నేను 20 సార్లు మోదీని కలిసినా ఫలితం లేకపోయింది.. మేం రాకాసులతో  కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నం.. రిజర్వేషన్ల సమస్య అంతకంటే పెద్దది కాదు..  తెలంగాణలో పెరిగిన గిరిజన జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్లు ఇవ్వడానికి మోదీకి ఏమైంది? ఆయన ఆలోచనలకు చెదలు పట్టాయా? బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, ముస్లింలకు జరగాల్సిన న్యాయం జరగడంలేదు.. ఆ స్థితి మారాలంటే కేంద్రంపై ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరగాలి. దేశ ప్రజల హక్కులను, రిజర్వేషన్లను కాపాడతాం. గిరిజనుల రిజర్వేషన్లను కేంద్రం మెడలు వంచైనా సాధిస్తాం..కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే.  జెండాలే తేడా. రెండు జాతీయపార్టీలు రాష్ట్రాలపై పెత్తనం చెలాయించాయి. ఇకపై ప్రాంతీయ పార్టీలు సత్తా చాటాలి, హక్కులు సాధించుకోవాలి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ కోసం కృషి చేస్తాం.. నేను రాష్ట్రంలోనే ఉంటాను. అయినా కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాం..’ అని అన్నారు. చంద్రబాబును విమర్శిస్తూ.. ‘జానారెడ్డి, ఉత్తమ్కు చేతకాక చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు.  రాష్ట్రాన్ని అమరావతికి తొత్తుగా మార్చాలని చూస్తున్నారు. చంద్రబాబును, ఆయనను తీసుకొచ్చేవారికి ఓటుతో దంచి బుద్ధిచెప్పండి..’ అని కోరారు.

 

Telugu news TRS chief Telangana CM KCR blame PM Modi for discrimination between hindu and mulsims and warns state about Chandrababu