mictv telugu

టీఆర్ఎస్ నాకు ఒక్క స్వీటూ ఇవ్వలేదు.. మోదీ

January 7, 2019

తెలంగాణలో విజయఢంకా మోగించిన టీఆర్ఎస్ ఇంతవరకు తనకు ఒక్క స్వీట్ కూడా తినిపించలేదని ప్రధాని మోదీ సరదాగా అన్నారు. ఆయనను కలవడానికి వెళ్లిన టీఆర్ఎస్ ఎంపీలతో నవ్వుతూ ఈ ముక్క చెప్పారు. టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత జితేందర్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు మోదీని ఈరోజు కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని మోదీని కోరారు. అప్పుడే మోదీ, వారితో సరదాగా సంభాషించారు.

Telugu news TRS did not give me a single sweet .. PM Modi.

తెలంగాణలో భారీ మెజార్టీతో గెలిచినా తనకు ఒక్క స్వీట్ కూడా తినిపించలేదని, మీ మంత్రులు, ఎంపీలు స్వీట్లు తిని, తనకు తినిపించారా అంటూ మోదీ నవ్వుతూ జితేందర్  రెడ్డితో అన్నారు. దీంతో ఎంపీలందరూ నవ్వుకున్నారు. మోదీ వ్యాఖ్యలపై జితేందర్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మీకు పుల్లారెడ్డి స్వీట్లు తినిపిస్తామని నవ్వుతూనే సమాధానమిచ్చారు. బెల్లం, జీడిపప్పుతో చేసే మిఠాయి స్వయంగా తీసుకొచ్చి ఇస్తామని మోదీకి చెప్పడంతో హాల్లో నవ్వులు విరిశాయి. నవ్వుల అనంతరం తమ పార్టీకి పార్లమెంట్‌లో 17 మంది ఎంపీలు వున్నారని, చట్టప్రకారం తమకు వెయ్యి గజాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని రాజేంద్రప్రసాద్ రోడ్డులో ఉన్న ఖాళీ స్థలాన్ని పార్టీ కార్యాలయానికి కేటాయించాలని ప్రధానిని కోరారు. Telugu news TRS did not give me a single sweet .. PM Modi