ఆ పేరుతో ఓట్లు అడిగితే చెంపలు వాయించండి.. కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆ పేరుతో ఓట్లు అడిగితే చెంపలు వాయించండి.. కేసీఆర్

November 19, 2018

‘కాంగ్రెస్ పార్టీలో మహానుభావులు, అంతర్జాతీయ మేధావులు ఉన్నారు.. విద్యుత్‌ను 9 గంటలు కూడా ఇవ్వలేని కాంగ్రెస్, టీడీపీ నేతల మేధావితనం ఎక్కడ పోయింది?’ అని ఎద్దేవా చేశారు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్. ఖమ్మం జిల్లా  పాలేరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు.

‘మా నియోజకవర్గంలోని ఎర్రవల్లిలో ఉచిత కంటివైద్య శిబిరంపెట్టినప్పుడు 227 మంది చికిత్స కోసం వచ్చారు. అక్కడే ఇంతమంది వస్తే తెలంగాణ వ్యాప్తంగా ఇంకా ఎంతమంది వస్తారోనన్న ఆలోచన నుంచే కంటివెలుగు పథకం పుట్టింది. ప్రజా సమస్యలు తెలుసుకుని మా ప్రభుత్వం వారికి అవసరమయ్యే పథకాలను అమలుపరుస్తోంది.  

Telugu news TRS has done many things that Congress can not do ... KCR.

అధికారం కోల్పోయిన మూడేళ్లకే కాంగ్రెస్ నేతలు 6 చందమామలు, 7 సూర్యుళ్లను తెస్తామని చెబుతున్నారు. పాలేరులో బోదకాలుతో బాధపడేవారిని గతంలో ప్రభుత్వాలు ఆదుకోలేదు. వారికి మా ప్రభుత్వం అండగా నిలిచి, ఉచితంగా చికిత్స అందజేస్తోంది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 411 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం’ అని వెల్లడించారు కేసీఆర్.

దేశంలోనే ఎక్కువ గౌరవవేతనం పొందే ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు, ట్రాఫిక్ పోలీసులు  తెలంగాణలోనే ఉన్నారన్నారు. అది కేవలం తమ సర్కార్ వల్లే సాధ్యమైందని చెప్పారు. రూ.43,000 కోట్లతో తెలంగాణను సంక్షేమ రాష్ట్రంగా మార్చామని పేర్కొన్నారు.

9 గంటలు కూడా విద్యుత్ ఇవ్వని వారి హయాంలో తన పొలంలో మోటార్లు కూడా  కాలిపోయాయని గుర్తుచేసుకున్నారు. తాను చెప్పేది అబద్ధం అయితే టీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు లేకుండా ఓడించాలని, అదే వాస్తవమైతే ప్రతిపక్షాలకు డిపాజిట్లు రానివ్వొద్దని ప్రజలను కోరారు. ‘ప్రజలు కులమతాల ప్రాతిపదికన ఓట్లు వేయొద్దు. కులాలు, మతాలు ఎవరికీ అన్నం పెట్టవు. ఫలానా కులం వ్యక్తే ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తే ఆ కులంలో పేదరికం పూర్తిగా వైదొలగిన దాఖలాలు లేవు. కులమతాల ఆధారంగా ఓట్లు అడిగేవాళ్ళ చెంపలు వాయించండి’ అని పిలుపునిచ్చారు కేసీఆర్.

Telugu news TRS has done many things that Congress can not do … KCR