టీఆర్ఎస్ ఓడితే.. కొడంగల్‌లో రేవంత్‌కు కేటీఆర్ సవాల్.. - MicTv.in - Telugu News
mictv telugu

టీఆర్ఎస్ ఓడితే.. కొడంగల్‌లో రేవంత్‌కు కేటీఆర్ సవాల్..

November 21, 2018

తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో విమర్శలతోపాటు సవాళ్లు, ప్రతిసవాళ్లు కూడా పెరిగిపోతున్నాయి. ప్రత్యర్థులపై మాటల దాడులు ఎక్కుపెడుతున్న మంత్రి కేటీఆర్ ఈ రోజు కొండగల్‌లో ప్రచారం నిర్వహించారు. భారీ జనసందోహం మధ్య ప్రసగించారు.

కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడైన రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ నేత ఈ సందర్భంగా గట్టి సవాల్ విసిరారు. ‘ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను. మరి కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డి రాజకీయాలను వదిలేస్తారా?’ అని అన్నారు. ఇవి ఆషామాషీ ఎన్నికలు కావని, రాష్ట్ర అభివృద్ధి కీలక దశలో జరుగుతున్నవని పేర్కొన్నారు.

Telugu news TRS leader and Telangana minister KTR challenges Revanth Reddy of Kodangal on winning of TRS and Congress in upcoming assembly elections.

విపక్ష కాంగ్రెస్‌కు సరైన నేతలు లేరని, వారి యావంతా అధికారం కోసమేనని అన్నారు. ‘టీఆర్ఎస్ విజయం సాధిస్తే కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారు. మరి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఆ పార్టీకి జిల్లాకు నలుగురు సీఎం అభ్యర్థులు ఉన్నారు.. ’ అని ఎద్దేవా చేశారు.

చంద్రబాబును విమర్శస్తూ.. ‘తెలంగాణ ప్రజలకు ఆయన అవసరమా? కాంగ్రెస్ సీల్డ్కవర్ సీఎం కావాలా? తెలంగాణ మట్టి బిడ్డ, తెలంగాణ సింహం కేసీఆర్ కావాలా? కొడంగల్ ప్రజలు ఏగట్టున ఉంటారో నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కొడంగల్కు నీళ్లు కావాలో, కన్నీళ్లు కావాలో తేల్చుకోండి.. కొడంగల్కు కృష్ణా జలాలు రావాలంటే కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. మరెవరివల్లా సాధ్యం కాదు.. ’ అని అన్నారు.  

Telugu news TRS leader and Telangana minister KTR challenges Revanth Reddy of Kodangal on winning of TRS and Congress in upcoming assembly elections