టీఆర్ఎస్‌కు కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామా

ఎన్నికల వేళ అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను నేరుగా తెలంగాణ భవన్కు పంపించారు. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో బుధవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరిస్తానన్నారు. వ్యక్తిగత కారణాలు, తెలంగాణ సాధన కోసం పోరాడిన కార్యకర్తలకు అన్యాయం, నియోజకవర్గ స్థాయిలో, పార్టీలో, రాష్ట్ర స్థాయిలో పలు సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు.

Telugu news TRS MP Konda Vishweswar Reddy resigns party on personal and political reasons on the eve of Telangana assembly Elections.

పార్టీలో సంప్రదాయ రాజకీయాలు లేవని ఆరోపించిన ఆయన ఎంపీగా తన నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఆశించిన స్థాయిలో పనిచేశానని పేర్కొన్నారు. పార్టీ రెండేళ్లుగా ప్రజలకు దూరమవుతోందని, ప్రభుత్వం కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని ఆక్షేపించారు.

తాను గులాబీ పార్టీని వీడే ప్రసక్తే లేని కొండా విశ్వేశ్వరరెడ్డి ఐదు రోజుల కిందట కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం తెలిసిందే. కొండాతోపాటు మరో ఎంపీ సీతారాం నాయక్ కూడా పార్టీ వీడతారని ఇటీవల వార్తలు రావడం తెలిసిందే. వీటిని వీరిద్దరూ ఖండించారు. కొండా కొంత కాలంగా పార్టీ  కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణ ఎన్నికల సందడిలోనూ కనిపించడం లేదు. ఆయన బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి.  కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేస్తారని కూడా ఊహాగానాలు వచ్చాయి. ఇవన్నీ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వ్యాప్తి చేస్తున్న పుకార్లని, తాను పార్టీ వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన కొండా చివరికి రాజీనామా చేయడం అధికార పార్టీలో కలకలం రేపుతోంది.

My Resignation to TRS (1)

Telugu news TRS MP Konda Vishweswar Reddy resigns party on personal and political reasons on the eve of Telangana assembly Elections