లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన... - MicTv.in - Telugu News
mictv telugu

లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన…

March 6, 2018

లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. సభ ప్రారంభమైన వెంటనే  రిజర్వేషన్ల అమలు రాష్ట్రాలకే అప్పగించాలంటూ నినదిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇదిలా వుండగా విభజన హామీలపై టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఎంపీలందరూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు.దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు  స్పీకర్ సుమిత్రా మహాజన్ వాయిదా వేశారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం కంటే ముందు గాంధీ విగ్రహం వద్ద టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.