కవితకు మోదీ నుంచి అనూహ్య మెసేజ్ - MicTv.in - Telugu News
mictv telugu

కవితకు మోదీ నుంచి అనూహ్య మెసేజ్

March 13, 2018

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అనూహ్య సందేశం అందింది. 39వ జన్మదినం జరుపుకుంటున్న కవితకు మోదీ తెలుగులో శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ  పంపించారు. దేశ ప్రజలకు సేవలు అందించేందుకు భగవంతుడు దీర్ఘకాలం పాటు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ప్రధాని తన లేఖలో పేర్కొన్నారు. కవిత 1978 మార్చి 13న జన్మించారు.

 

ఇటీవలి కాలంలో కవిత తండ్రి, సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ, విమర్శిస్తూ, బీజేపీని దుయ్యబట్టడం తెలిసిందే. అయితే అవన్నీ పట్టించుకోకుండా  ప్రధాని కవితను అభినందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.