రాజేంద్రప్రసాద్ రోడ్డులో టీఆర్ఎస్ ఆఫీసు

దేశ రాజధానిలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఏర్పాటుకు అధిష్టానం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకై దేశ పర్యటనలో భాగంగా మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోదీని మర్యాద పూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీస్ నిర్మాణం గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎంపీలు సోమవారం ప్రధానిని కలిశారు. దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం కోసం భూమి కేటాయింపుపై వారు ప్రధానంగా ప్రధానితో చర్చించినట్టుగా సమాచారం.

అనంతరం మీడియాతో టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యలయ నిర్మాణానికి భూమి కేటాయింపుపై మోదీతో చర్చించినట్టు తెలిపారు. రాజేంద్రప్రసాద్‌ రోడ్డులో ఖాళీగా ఉన్న స్థలాన్ని తమకు కేటాయించాలని ప్రధానిని కోరినట్టు వెల్లడించారు. ఉభయసభల్లో కలిపి 17మంది ఎంపీలు వున్న తమకు చట్ట ప్రకారం 1000 చదరపు గజాల స్థలం వస్తుందని చెప్పారు. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ గైడ్‌‌లైన్స్‌ ప్రకారం 1000 చదరపు మీటర్ల స్థలం ఇవ్వాలని తెలిపారు.

bb

 

Telugu news TRS office at Rajendra Prasad Road