ఆందోల్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణుల దాడి

మరికొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మొదలు కానున్న నేపథ్యంలో ఆందోల్ నియోజకవర్గంలో కాసేపటి కిందట ఘర్షణ జరిగింది. మునిపల్లె ప్రాంతంలో టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఇమ్రాన్, గోరా అనే తమ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా దాడి చేశారని టీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి. తీవ్ర రక్తస్రావమైన బాధితులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

r

నియోజకవర్గంలో నిన్న కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా తమ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్, కార్యకర్తలు అడ్డుకున్నారని, దీంతో ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆందోల్ నుంచి కాంగ్రెస్ తరఫున మాజా డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ పోటీ చేస్తున్నారు.