పోలియో బాధిత బాలుడికి కేటీఆర్ భరోసా

రామగుండానికి చెందిన ఓ పోలియో బాధిత బాలుడికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆపద్బాంధవుడయ్యారు. శివసాయి అనే పోలియో బాధిత బాలుడి వైద్య ఖర్చులు తానే భరిస్తానని కేటీఆర్ ఇటీవల ప్రకటించారు. కాగా, శుక్రవారం సికింద్రాబాద్‌లోని సన్‌షైన్ దవాఖాన వైద్యులు శివసాయికి పరీక్షలు జరిపించారు. పరీక్షలు నిర్వహించిన ఎండీ డాక్టర్ గురువారెడ్డి శివసాయిని నడిచేలా చేస్తానని భరోసా ఇచ్చారు.

Telugu News trs working president ktr to help polio victim boy from ramagundam .

ఫిబ్రవరి మొదటివారంలో నెలలో శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. శివ సాయి స్థానిక ఎమ్మెల్యే కొరుకంటి చందర్ ద్వారా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. బాలుడికి అవసరమైన చికిత్సను అందిస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. బాలుడిని డాక్టర్లకు చూపించాల్సిందిగా జీహెచ్‌ఎంసీ టీఆర్‌ఎస్ నాయకులు కట్టెల శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. కాగా, శుక్రవారం వైద్యులు పరీక్షలు నిర్వహించడం విశేషం. కేటీఆర్ తీసుకున్న చొరవకు బాధిత బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Telugu News trs working president ktr to help polio victim boy from ramagundam