టైమ్ అవార్డును తిరస్కరించిన ట్రంప్ - MicTv.in - Telugu News
mictv telugu

టైమ్ అవార్డును తిరస్కరించిన ట్రంప్

November 25, 2017

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  విచిత్ర వైఖరి ఏంటో టైమ్స్ మేగజీన్ వారికి అర్థం కాకుండా తయారైంది. తాజాగా ఆయనకు ‘ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ – 2017 ’ అవార్డును టైమ్స్ ప్రకటించింది. కానీ ట్రంప్ దాన్ని తన ట్విట్టర్ ద్వారా  చల్లగా తిరస్కరించాడు. ఒకప్పుడు ఈ అవార్డు కోసం ట్రంప్  ఉబలాటపడిన సందర్భాలు వున్నాయి. 2015లో తనను అవార్డుకు ఎంపిక చేయకపోవడం పట్ల ట్రంప్ నిప్పులు చెరిగారు కూడా.ఎందుకు తను అవార్డును తిరస్కరిస్తున్నాడు అనే ప్రశ్నకు సమాధానంగా ‘ ఎంపికైతే మేగజీన్ కవర్ పేజీ కోసం ఫోటోషూట్ చేయాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు ’ అంటూ సమాధానమిచ్చారు ట్రంప్. ట్రంప్ ట్వీట్‌కు టైమ్స్ స్పందించింది. అవార్డు ఇచ్చేందుకు తాము  అనుసరించే విధానాల గురించి తెలుసుకోకుండా ట్రంప్ వ్యాఖ్యలు చేయడం సముచితం కాదని వివరణ ఇచ్చింది.