చిన్నారులతో చిలిపి ట్రంప్  - MicTv.in - Telugu News
mictv telugu

చిన్నారులతో చిలిపి ట్రంప్ 

October 28, 2017

అమెరికాలోని వైట్‌హౌజ్‌లో హాలోవీన్ సందడి మెుదలైంది. అమెరికా అధ్యక్షుడు  డోనాల్డ్ ట్రంప్  హాలోవీన్ దుస్తుల్లో వచ్చిన చిన్నారులతో సరదాగా మచ్చటించారు. వైట్‌హౌజ్ రిపోర్టర్ల పిల్లలు ఈ  కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిన్నారులు రకరకాల భూతాల వేషాలతో  ట్రంప్‌ను ఆకట్టుకున్నారు. విభిన్నమైన దుస్తుల్లోొ వచ్చిన చిన్నారులను ఉద్దేశించి ట్రంప్ ఫన్నీగా మాట్లాడారు. ఓ డ్రెస్ నన్ను  చాలా భయపెడుతుందంటూ పిల్లల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక మీడియాపైన కూడా తనదైన  విధానంలో మెచ్చుకున్నాడు ట్రంప్. మీడియా మిత్రులకు ఇంత మంచి పిల్లలు ఉన్నారా? నమ్మలేకపోతున్నాను. చాలా అందమైన పిల్లల్ని కన్నారంటూ రిపోర్టర్లకు శుభాంక్షాలు తెలిపారు.

 

మీపేరెంట్స్ లాగే, మీరు కూడా మంచి  భవిష్యత్తులో  ఉండాలని పిల్లలకు  చెప్పాడు. మీడియా నన్ను చూసినట్టే మిమ్మల్ని చూస్తుందా? మిమ్మల్ని  బాగచూసుకుంటుందనుకుంటా అని వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత ట్రంప్ ఇచ్చిన చాకెట్లను పిల్లలు తింటూ  ఎంజాయ్  చేశారు. ఈ చాకెట్లతో బరువు పెరగరనుకుంటా అని  చమత్కరించిన ట్రంప్ పిల్లలతో సరదాగా గడిపాడు.