పోర్న్‌స్టార్‌తో ట్రంప్ సంబంధం నిజమే - MicTv.in - Telugu News
mictv telugu

పోర్న్‌స్టార్‌తో ట్రంప్ సంబంధం నిజమే

February 15, 2018

‘ఎన్నికల సమయంలో అధ్యక్ష పదవి కోసం ట్రంప్ వ్యక్తిగత విషయాలను గోప్యంగా వుంచాం. ఆయనకు ఓ పోర్న్‌స్టార్‌తో లైంగిక సంబంధం వున్న మాట వాస్తవమే. ఆ విషయం బయటకు పొక్కుకుండా ఉండేందుకు భారీ మొత్తంలో డబ్బు చెల్లించి ఆ నటితో ట్రంప్‌ ఒప్పందం కూడా చేసుకున్నాం.. ’ అని అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ వ్యక్తిగత సలహాదారు మైకేల్‌ కోహెన్‌ న్యూయార్క్‌ టైమ్స్‌ ఇంటర్వ్యూలో  బాంబు పేల్చారు.

‘పోర్న్‌స్టార్ స్టోర్మీ డేనియల్స్‌తో ఈ విషయం బయటకు పొక్కకుండా ట్రంప్ లక్షా, 30,000 డాలర్లు ఇచ్చి రహస్యంగా వుంచిన మాట వాస్తవమే. కాకపోతే ఇది స్టోర్మీని ప్రలోభానికి గురి చేయటానికి చేసుకున్న ఒప్పందం కాదు. ఎన్నికల సమయంలో ఇలాంటి వార్తలు బయటకు రావటం వల్ల  రాజకీయ విమర్శలు తలెత్తుతాయని ఈ పని చేశారు. ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. కాబట్టి స్టోర్మీ కూడా ఈ విషయాన్ని నిరభ్యంతరంగా బయటకు చెప్పొచ్చు ’ అన్నారు కోహెన్. అయితే ఈ ఆరోపణలను వైట్ హౌజ్ ఖండించింది.

ఇదిలా వుండగా ఇన్‌టచ్ అనే మ్యాగజైన్‌లో స్మోర్మీ డేనియల్స్ ఇంటర్వ్యూను ప్రచురించగా.. వాల్‌స్ట్రీట్ దానిని యథాతథంగా ప్రచురించింది. అందులో ట్రంప్ భార్య ( మెలానియా ) ప్రసవించటానికి నాలుగు నెలల ముందే ట్రంప్‌తో నాకు ఎఫైర్ ఏర్పడింది. తన కూతురు ఇవాంకలా నేను చాలా అందంగా వుంటానంటూ ట్రంప్ చాలాసార్లు పొగిడేవారు. అలా మా బంధం కొంతకాలం సజావుగా సాగిందని చెప్పింది. కాగా అది ఒట్టి కల్పిత కథనం అని అప్పట్లో వైట్‌హౌజ్ దాన్ని కొట్టి పారేయటం గమనార్హం