టీటీడీలోని అన్యమత ఉద్యోగులను తీసేయొద్దు - MicTv.in - Telugu News
mictv telugu

టీటీడీలోని అన్యమత ఉద్యోగులను తీసేయొద్దు

February 21, 2018

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో పనిచేసే అన్యమతాలకు చెందిన ఉద్యోగుల వివాదం హైకోర్టుకు చేరడం తెలిసిందే. కేసుకు సంబంధించిన ప్రస్తుత వివరాలను పరిశీలించిన కోర్టు వారిని ఇప్పటికప్పుడు ఉద్యోగాల నుంచి తొలగించవద్దని టీటీడీని బుధవారం ఆదేశించింది.

ఈమేరకు   మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అన్యమతస్థులను ఉద్యోగాల్లో కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. టీటీడీ సంజాయిషీ నోటీసులకు వివరణ ఇవ్వాలని ఉద్యోగులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ సంజాయిషీ నోటీసుల చట్టబద్ధతను తర్వాత పరిశీలిస్తామని హైకోర్టు స్పష్టంచేసింది.