టీటీడీ ఆలయాల్లో ఇక దళిత అర్చకులు - MicTv.in - Telugu News
mictv telugu

టీటీడీ ఆలయాల్లో ఇక దళిత అర్చకులు

December 7, 2017

దేవాలయాల్లో తరతరాలుగా  వస్తున్న కట్టుబాట్లకు చర గీతం పాడిన కేరళ ప్రభుత్వం బాటలోనే నడిచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా సిద్ధమైంది.  ఆరుగురు దళిత యువకులను ఆర్చకులుగా నియమించిన ట్రావెన్ కోర్ దేవస్వ బోర్డు  తరహాలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్సీ, ఎస్టీ యువకులను అర్చకులుగా నియమించేందుకు  రంగం సిద్ధం చేసింది.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోని దేవాలయాల్లో ఎస్సీ, ఎస్టీ యువకులను అర్చకులుగా నియమించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు. త్వరలోనే నియమాకాలను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. దళితులకు టీటీడీ ఆధ్వర్యంలో అర్చకత్వంలో శిక్షణ ఇస్తున్నామని  చెప్పారు. ఇప్పటికే తొలి బ్యాచ్  శిక్షణ పూర్తి అయిందని,  త్వరలోనే మరో బ్యాచ్ శిక్షణ ప్రారంభం అవుతుందని తెలిపారు.

 ఎస్సీ, ఎస్టీ కాలనీలో టీటీడీ ఆధ్వర్యంలో ధ్యాన మందిరాలను, దేవాలయాలను నిర్మించామని, అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని వివరించారు. మరికొన్ని ప్రాంతాలలో దేవాలయాలను నిర్మించడానికి  నాలుగు ఐటీడీఏ ప్రాంతాల్లో 500 గ్రామాలను ఏంపిక చేశామని అనిల్ తెలిపారు.