తెలంగాణ అమరుల కుటుంబాలకు జాబ్.. టీడీపీ మేనిఫెస్టో - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ అమరుల కుటుంబాలకు జాబ్.. టీడీపీ మేనిఫెస్టో

November 20, 2018

తెలంగాణ రాష్ట్ర ఓటర్లపై టీటీడీపీ హామీల వర్షం కురిపించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ పార్టీలు తమ తమ మేనిఫెస్టోలను ప్రకటించాయి. ఈ క్రమంలో టీడీపీ కూడా తన మేనిఫెస్టోను ప్రకటించింది. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇచ్చింది. 1200 మంది అమరవీరుల కుటుంబాల్లో ఇంటికొక ఉద్యోగం, ఇల్లు, రూ.10 లక్షల ఆర్థికసాయం అందిస్తామని తమ మేనిఫెస్టోలో పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించింది.

టీ టీడీపీ మేనిఫెస్టో ఇలా…

 • 1200 మంది తెలంగాణ అమరవీరుల కుటుంబాల్లో ఇంటికొక ఉద్యోగం, ఇల్లు, రూ.10 లక్షల ఆర్థికసాయం
 • అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే లక్ష ఉద్యోగాల భర్తీ
 • నిరుద్యోగ యువతకు రూ. 3 వేల భృతి
 • రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ
 • తమ సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునేవారికి రూ. 5 లక్షల ఆర్థికసాయం
 • 60 ఏళ్లు దాటిన వృద్ధులు, అనాధలు, వితంతువులకు ప్రతి నెలా రూ. 2 వేల పింఛన్
 • ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలకు పెంపు
 • ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఉన్న పెన్షన్ విధానం వర్తించేలా చర్యలు
 • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్ ప్లాన్ అమలు
 • వికలాంగులకు రూ. 3 వేల ఫించన్, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
 • ఇంటర్ నుంచి యూనివర్సిటీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్లు
 • అర్హులైన పేద కుటుంబాల బాలికలకు పెళ్లి సమయంలో రూ. 1.50 లక్షల ఆర్థికసాయం
 • ప్రతి కుటుంబంలో ఒక్కో సభ్యునికి 7 కిలోల బియ్యం
 • ప్రగతిభవన్ను ప్రజా ఆసుపత్రిగా మార్పు
 • జయశంకర్ పేరు మీద ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ఏర్పాటు.

Telugu news TTDP manifesto … A job in Immortal heroes families, house, 10 lakh financial assistance …