అమెరికా అధ్యక్ష రేసులో తొలిసారిగా హిందువు

వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు భారతీయులకు కూడా ఆసక్తికరంగా మరనున్నాయి. 2020 ఎన్నికల్లో తొలిసారిగా ఓ హిందువు పోటీ పడుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తాను పోటీ చేస్తున్నట్లు భారత సంతతికి చెందిన హిందూ మహిళ, కాంగ్రెస్ సభ్యురాలు, డెమోక్రాట్ల నేత తులసీ గబార్డ్ ప్రకటించారు. పూర్తి వివరాలను వచ్చేవారం వెల్లడిస్తానన్నారు. ఎన్నికల్లో ఆమె గెలిస్తే అగ్రరాజ్య అధ్యక్ష పదవి చేపట్టిన తొలి హిందువుగానే కాకుండా తొలి క్రైస్తవేతర వ్యక్తిగానూ రికార్డుకెక్కుతారు. 37 ఏళ్ల తులసి.. హవాయ్ నుంచి నాలుగుసార్లు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఆమె అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న రెండ హిళ. మరొకరు సేనేటర్ ఎలిజబెత్ వారెన్.  ఎన్నికల్లో భార సంతతికి చెందిన పదిమందికిపైగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో కాలిఫోర్నియా సేనేటర్ లా హారిస్ ఒకరు. క్రైస్తవ కుటుంబంలో జన్మించిన తులసి టీనేజ్ వయసులో హిందూ మతం స్వీకరించారు. ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి హిందువు రికార్డు కూడా ఆమెదే.