ఘోరం..  బాలింత మృతదేహం వెలివేత - MicTv.in - Telugu News
mictv telugu

ఘోరం..  బాలింత మృతదేహం వెలివేత

November 18, 2017

సమాజం సాంకేతికంగా ఎంత ఎదుగుతున్నా మూఢనమ్మకాలు పోవడం లేదు. రంగారెడ్డిలో జిల్లాలో ఒక బాలింత మృతదేహాన్ని వెలివేశారు. అమావాస్య రోజు చనిపోయిందంటూ ఊర్లోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో బంధువులు వేరేదారిలేక గ్రామ శివారులోనే దహన సంస్కారాలు నిర్వహించారు.

అబ్దుల్లాపుర్‌మెట్ మండంలం తుర్కయింజల్  గ్రామం  వైఎస్సాఆర్ కాలనీకి చెందిన మాలతి ఈ మధ్యనే ఓ చిన్నారికి జన్మించింది. ఆరోగ్యం క్షిణించడంతో మాలతి మరణించింది. ఆమె అమావాస్య రోజున మృతి చెందడం  ఆమె చేసిన పాపం అయినట్టుగా అయింది. గ్రామ ప్రజలు  ఊరికి అరిష్టమంటూ మృతదేహాన్ని ఊరిలోకి రానీయలేదు.  

దీంతో ఊరు బయట టెంట్ వేసి బందువుల చివరి చూపు కోసం మృతదేహాన్ని ఉంచారు.  ఊరు పోలిమేరలో చెరువు  వద్ద అంత్యక్రియలను  కూడా స్థానికులు అడ్డుకున్నారు .  కుటుంబ సభ్యులు, గ్రామస్థుల మధ్య వాగ్వివాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని  గ్రామస్తులకు  సర్థి చెప్పారు. మరోసారి ఇలాంటి సంఘటనలు  పునరావృతం  కావద్దని హెచ్చరించారు. తర్వాత అక్కడే అంత్యక్రియలు జరిగాయి.