mictv telugu

ఝాన్సీ ఆత్మహత్య కేసు.. ప్రియుడికి రిమాండ్..

February 12, 2019

బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు సూర్యను పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్య వేధింపుల కారణంగానే ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఝాన్సీ వాట్సాప్‌ను పరిశీలించారు. ఝాన్సీ సూర్య కొద్ది రోజులుగా ప్రేమించుకున్నారని, ఝాన్సీ చనిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా సూర్యకు కాల్స్ చేసిందని పోెలీసులు వెల్లడించారు.  

Telugu News Tv Actor Jhansi Suicide Case.. Lover Surya Arrest.. 14 Days Remand In chanchalguda jail

ఝాన్సీ నటించడం ఇష్టంలేని సూర్య ఆమెను షూటింగ్‌లకు వెళ్లొదని, పెళ్లి చేసుకోవాలంటే నటన మానేయాలని ఒత్తిడికి గురిచేశాడు. అంతేకాదు ఝాన్సీని ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా షరతులు పెట్టాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి 14రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.Telugu News Tv Actor Jhansi Suicide Case.. Lover Surya Arrest.. 14 Days Remand In chanchalguda jail