సీరియల్ నటిని కరిచిన కుక్క - MicTv.in - Telugu News
mictv telugu

సీరియల్ నటిని కరిచిన కుక్క

April 19, 2018

నటీనటులు  తాము పోషించే పాత్రల్లో జీవించడానికి ఎంత సహసమైనా చేస్తారు. కానీ కొన్ని సందర్బాల్లో ఆ ప్రయత్నాలు బెడిసికొడుతుంటాయి. గాయాలపాలై ఆస్పత్రుల్లో చేరతారు.  తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటి రీనా అగర్వాల్ కూడా గాయపడింది. అదీ ఓ కుక్క దాడిలో.

రీనా ప్రస్తుతం  ‘క్యా హాల్ మిస్టర్ పంచల్’ టీవీ షో నటిస్తోంది. ఈ కార్యక్రమంలో ఆమె కుక్కతో కలసి ఓ సన్నివేశంలో నటించాల్సి ఉంది. షూటింగ్  కుక్కకు దిక్కతోచక రెచ్చిపోయి రీనా ముఖంపైన కరిచేసింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ కుక్కను తరిమేశారు. తీవ్రంగా గాయపడిన రీనాను  ముంబైలోని కోకిల ఆస్పత్రికి తరలించారు. ఆమె ముఖంపై కుట్లు పడ్డాయని, నెల రోజుల పాటుగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.