ఓ ఛానల్‌పై  సినీనటి పోలీసులకు ఫిర్యాదు... - MicTv.in - Telugu News
mictv telugu

ఓ ఛానల్‌పై  సినీనటి పోలీసులకు ఫిర్యాదు…

April 14, 2018

ఓ మీడియా ఛానల్ చర్చా వేదికలో  తనను ముగ్గురు సహనటులు కించపరిచారని ఓ నటి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ చర్చా కార్యక్రమంలో తనకు మాట్లాడటానికి అవకాశం కల్పించలేదని సదరు టీవీ  ఛానల్‌పై ఆరోపణలు చేస్తూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సినీ పరిశ్రలో నెలకొన్న ‘కాస్టింగ్ కౌచ్ ’ వివాదంపై ఒక టీవీ ఛానల్‌లో చర్చాకార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో రాఘశృతి, సునీత అనే నటీమణులు పరస్పర ఆరోపణలు ,విమర్శలు చేసుకున్నారు.రాఘశృతిది ,తనది ఒకే  ఊరు కావడంతో ఆమెతో స్నేహం చేశానని సునీత  చెప్పింది. కొన్నాళ్లయ్యాక సినిమాల్లో అవకాశం కల్పిస్తానంటూ, ఆమె తనతో చెడు పనులు చేయించేందుకు ప్రయత్నించిందంటూ సునీత ఆరోపణలు చేసింది. అంతకుముందు ఆమె ఆ టీవీ ఛానల్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేసి, ఛానల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఛానల్ ఫిర్యాదుతో, పోలీసులు ఆమెను స్టేషన్‌కు తరలించారు.