టీవీ ఎక్కువగా చూస్తే నూకలు చెల్లినట్టే - MicTv.in - Telugu News
mictv telugu

టీవీ ఎక్కువగా చూస్తే నూకలు చెల్లినట్టే

February 23, 2018

కొందరు ఏ కాస్త ఖాళీ దొరికినా టీవీకి బంకలా అతుక్కుపోతారు. గంటో, గంటన్నరో అయితే ఫర్వాలేదుగాని గంటలపాటు టీవీని అతుక్కుపోతే తర్వాత ఆస్పత్రి మంచాలకు అతుక్కుపోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గంటల తరబడి టీవీ చూడడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయిని బర్లింగ్టన్ యూనివర్శిటీ పరిశోధకులు హెచ్చరించారు.

ఎక్కువసేపు టీవీ చూస్తే శరీరంలోని రక్తం గడ్డకట్టే అవకాశం ఉందన్నారు. అంతేకాదు, ‘చిరుతిళ్లు తింటూ టీవీ చూస్తే గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఊబకాయ సమస్యలు వస్తాయి’ అని చెప్పారు. అలాగే ఊపిరితిత్తుల సమస్యలు కూడా వస్తాయని, ప్రాణాలకే ప్రమాదమని పరిశోధకులు పేర్కొన్నారు.45 నుంచి 64 ఏళ్ల మధ్య వయస్సున్న 15,158 మందిపై ఈ అధ్యయనం చేశారు.