mictv telugu

‘రాముడు’ కాంగ్రెస్‌లోకి.. బీజేపీ సుమిత్రపై యుద్ధం

February 7, 2019

1980లలో మన దేశ ప్రజలు టీవీ రామాయాణానికి జనం నీరాజనాలు పట్టారు. రామాయణం అంటే  అదీ అంటూ తెగ మెచ్చుకున్నారు. రామానంద సాగర్ తీసిన ఆ సీరియల్‌లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ కూడా ఎంతో పాపులర్ అయ్యారు. ఆయన ఉన్నట్టుండి వార్తల్లోకి ఎక్కేశారు.Telugu news tv ramayan ram arun govil joining congress and contesting from indore lok sabha constituency against bjp candidate speaker Sumitra Mahajanఅరుణ్.. త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి, మధ్యప్రదేశ్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీని ఓడించేందుకు, ఆయన సాయం తీసుకోడానికి కాంగ్రెస్ పక్కా ప్రణాళికలు రూపొందిస్తోంది. బీజేపీకి పెట్టని కోటగా భావించే ఇండోర్‌ నుంచి ఆయనను బరిలోకి దింపాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఆ స్థానం నుంచి  బీజేపీ ఎంపీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమెను ఓడగొట్టడానికి ‘టీవీ’ రాముడే సరైన సమవుజ్జీ అని హస్తం నేతలు భావిస్తున్నారు. అరుణ్ గోవిల్‌కు ఉన్న రాముడి ఇమేజీని ఈ విధంగా కాంగ్రెస్ వాడుకోవడంపై బీజేపీ నేతలు నోరెళ్లబెడుతున్నారు. గోవిల్‌ను ముందుగా తామే సంప్రదించి ఉంటే బాగుండేదని వాపోతున్నారు.