అంతర్జాలంలో తెలుగు వెలుగులు...  21,000 కొత్త పదాలు - MicTv.in - Telugu News
mictv telugu

అంతర్జాలంలో తెలుగు వెలుగులు…  21,000 కొత్త పదాలు

November 3, 2018

‘తెలుగు భాష తియ్యదనం.. తెలుగు భాష గొప్పతనం.. తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం.. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా.. తెలుగు మరచిపోతే వాళ్లని నువు మరచినట్టురా  ఇది మరువబోకురా..’ అంటూ మాతృభాష రుణం తీర్చుకునేందుకు ఖమ్మం జిల్లాకు చెందిన ఐఐఐటీ హైదరాబాద్ పరిశోధక విద్యార్థిని శ్రీకవిత పారుపల్లి కొత్త ప్రయత్నం చేశారు. 21,000 ప్రాచీన తెలుగుపదాలను ఇంటర్నెట్‌లో పొందుపర్చి సాంకేతిక ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు కృషి చేసి పరిశోధన పత్రం సమర్పించారు.

Twenty One Thousand Telugu New Words In Internet... Credit Goes To Khammam IIIT Student Sri Kavitha.

దీనిపై శ్రీకవిత పారుపల్లి మాట్లాడుతూ.. ‘మనం రోజు ఉపయోగించే పదాలు ఇంటర్నెట్‌లో కేవలం 9,000 ఉండటం నాకు ఎంతో బాధ కలిగించింది. ఆ సమస్యను ఎలాగైన అధిగమించాలనే లక్షంతో దీనిపై పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నాను.

ప్రొఫెసర్ నవజ్యోతిసింగ్‌తో మాట్లాడి అభిప్రాయం తీసుకున్నాను. మూడు నెలలు కష్టపడి ‘తెలుగు వర్డ్‌నెట్‌’ ద్వారా తెలుగు పదాలు పొందుపరిచాను. మా బామ్మ నుంచి మాతృభాషా మాధుర్యాన్ని గుర్తించాను. మా అమ్మ విజయలక్ష్మి సహాయంతో ఇదంతా చేయగలిగాను’. ఆమె పేర్కొన్నారు.

Telugu News Twenty One Thousand Telugu New Words In Internet… Credit Goes To Khammam IIIT Student Sri Kavitha