ట్వింకిల్‌ ఖన్నా ఫొటోపై రగడ - MicTv.in - Telugu News
mictv telugu

ట్వింకిల్‌ ఖన్నా ఫొటోపై రగడ

October 25, 2017

బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా పుస్తకాలపై కూర్చున్న ఫోటో వివాదాస్పదమయ్యింది. ‘వోగ్ ఇండియా మేగ‌జైన్’ కోసం ట్వింకిల్‌ఖన్నా పుస్తకాలపై కూర్చుని ఫోటో దిగింది, ఆ ఫోటోను ట్వింకిల్ తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

‘పుస్తకాలను ఎవరైనా తొక్కుతారా ? ఓ రచయిత అయ్యిండి ట్వింకిల్ పుస్తకాలను కించపరిచింది, రేపు నీ పుస్తకాలను కూడా ఇలాగే చేస్తే ఏం చేస్తావ్? అంటూ ట్వింకిల్‌ను విమర్శిస్తున్నారు. పుస్తకం సరస్వతి దేవీ రూపమని, ఆమెను ఇలా అవమానించడం భావ్యం కాదని హిందూ సభగాలు కూడా భగ్గుమంటున్నాయి. ఈ విమర్శలకు  ట్వింకిల్ కూడా ఘాటగా సమాధానమిచ్చారు.

 ‘నేను పుస్తకాలపై కూర్చోలేదని, స్టూల్ మీద కాలు పెట్టాను.. నాకు పుస్తకాల మీద కూర్చోవ‌డానికి ఎలాంటి సంకోచం లేదు, అంతేకాదు వాటి ప‌క్కనే ప‌డుకుంటా, వీలైతే బాత్రూమ్‌కి కూడా తీసుకెళ్తా, పుస్తకాల‌ను చ‌దివిన‌పుడే మనకు జ్ఞానం వ‌స్తుంది, వాటిని గౌర‌వించిన‌పుడు కాదు` అని నెటిజన్లకు చెప్పింది. ట్వింకిల్  `మిసెస్ ఫ‌న్నీ బోన్స్’,`ద లెజెండ్ ఆఫ్ లక్ష్మీప్రసాద్‌` అనే రెండు పుస్తకాల‌ను ర‌చించింది.