పీఎన్‌బీ కేసులో ట్విస్ట్.. చందాకొచ్చర్, శిఖాశర్మలకు సమన్లు - MicTv.in - Telugu News
mictv telugu

పీఎన్‌బీ కేసులో ట్విస్ట్.. చందాకొచ్చర్, శిఖాశర్మలకు సమన్లు

March 6, 2018

పీఎన్‌బీ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడ్డ నీరవ్ మోదీ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ ఒకటి తెరపైకి వచ్చింది. ఈ కేసులో అన్నీ కోణాల్లో లోతుగా విచారిస్తున్న సీబీఐ, ఎన్‌ఫౌర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ చందాకొచ్చర్‌కు, యాక్సిస్ బ్యాంక్ ఎండీ శిఖా శర్మకు సమన్లు జారీ చేశారు.  వీరిద్దరితో పాటు పలు ప్రైవేటు బ్యాంకుల చైర్మన్లు, ఎండీలూ కూడా నోటీసులు అందుకోనున్నారని సమాచారం. ఈ స్కామ్‌లో ఇప్పటివరకూ 16 మందిని సీబీఐ అరెస్ట్ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి ఎల్ఓయూ (లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్స్) తీసుకుని నీరవ్‌కు ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర 15కు పైగా బ్యాంకులు, ముందూ వెనుకా చూడకుండా అప్పనంగా రుణాలిచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా టాప్ బ్యాంకర్స్ అందరినీ ప్రశ్నించాలని అధికారులు నిర్ణయించడం కలకలం రేపుతోంది.