ట్విట్టర్ సీఈఓపై బ్రాహ్మణుల ఆగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

ట్విట్టర్ సీఈఓపై బ్రాహ్మణుల ఆగ్రహం

November 20, 2018

ట్విట్టర్ సీఈఓ గతకొన్ని రోజులుగా ఇండియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో జాక్ పలువురు ప్రముఖులను కలిసాడు. అయితే ఈ పర్యటనలో జాక్‌కు కొంతమేర నిరసన సెగ కూడా తగులుతోంది. జాక్  ప్రదర్శించిన ఓ పోస్టర్‌ ఇప్పుడు వివాదాస్పదమైంది.Telugu News Twitter ceo jack dorsey poster controversyభారత పర్యటనలో భాగంగా ఇటీవల కొంత మంది మహిళా జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలతో సమావేశమైన జాక్… ఓ ఫొటోకు ఫోజిస్తూ.. ఓ పోస్టర్‌ను ప్రదర్శించారు. ఈ ఫొటోను ఆ సమావేశానికి హాజరైన ఓ జర్నలిస్ట్‌ తన ట్విటర్‌ ఖాతాలో ‘మహిళా జర్నలిస్టులు, రచయితలు, సామాజిక కార్యకర్తలతో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో భాగమయ్యాను. భారత్‌లో ట్విటర్‌ అనుభవంపై చర్చించాం. చాలా సంతోషంగా ఉంది.. ఈ సంభాషణను వర్ణించడానికి మాటలు రావడం లేదు’  అని క్యాఫ్షన్‌గా పేర్కొన్నారు. అయితే ఈ ఫొటోలో జాక్‌ డోర్సీ ప్రదర్శించిన పోస్టర్‌లో ‘బ్రాహ్మణిక పితృస్వామ్యం నశించాలి’ అని రాసుంది.

దీనితో బ్రాహ్మణ సంఘాలు జాక్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ట్విట్టర్ సీఈవో కేవలం వామపక్ష జర్నలిస్టులతోనే ఎందుకు సమావేశమయ్యారు? వారికీ కొమ్ము కాస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నాయి. ఈ వివాదంపై స్పందించిన జాక్ ఆ పోస్టర్‌ను కావాలని పట్టుకోలేదని, సమావేశానికి హాజరయిన ఒక దళిత మహిళా జర్నలిస్ట్ ఆఫర్ చేస్తే పట్టుకున్నానని తెలిపాడు.