ట్విట్టర్ వార్తలన్నీ.. పిట్ట కథలే ! - MicTv.in - Telugu News
mictv telugu

ట్విట్టర్ వార్తలన్నీ.. పిట్ట కథలే !

March 10, 2018

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ వార్త నిజమో, ఏ వార్త అబద్ధమో ఎవ్వరూ కనిపెట్టలేక పోతున్నారు. ఎందుకంటే అందులో చాలా మంది ఫేక్ గాళ్లే కాబట్టి. అందులో  వచ్చే వార్తల్లో సగానికంటే ఎక్కువ ఫేక్ వార్తలే అని మరోసారి రుజువైంది. ట్విట్టర్లో వచ్చే చాలా వార్తలు కేవలం పుకార్లని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన సొరోష్ వొసౌమి  ప్రకటించారు. ఆ తప్పుడు వార్తలనే నిజమైన వార్తలని నమ్మి చాలా మంది రీట్వీట్లు కామెంట్లు చేస్తున్నారని తెలిపారు.

ట్విటర్ వార్తలను నిర్ధారించుకోకుండా రీట్వీట్లు చేస్తుండడంతో  అవి అతివేగంగా ఎగిరిపోయి అందరి దృష్టిలో పడుతున్నాయి. 2006 నుంచి 2017  మధ్య ట్విట్టర్లో వచ్చిన 1,26000 వార్తలను పరిశీలించగా అందులో చాలా వరకు ఫేక్ వార్తలే ఉన్నట్లు రుజువైంది. దాదాపు 30 లక్షల మంది  45 లక్షల సార్లు ఆ వార్తలను రీట్వీట్ చేశారు.

అందుకే మంచికంటే చెడే ఎక్కువగా పాకిపోతుంది అన్నట్లుగా నిజమైన వార్తల కంటే తప్పుడు వార్తలే  అందరికి తొందరగా చేరువవుతున్నాయి. అందుకే సోషల్ మీడియాలో వచ్చింది కదా అని,ఇంత మంది రీట్వీట్ చేశారు కదా అని దేన్ని పడితే దాన్ని నమ్మెరు సుమా..!