కొండచిలువతో ఫేస్‌బుక్‌లో హల్‌చల్..  

వన్య ప్రాణులతో చెలగాటాలు ఆడకుండా చట్టాలను ఎంత కఠినతరం చేస్తున్నా కొందరు వాటి ప్రాణాలతో ఆడుతూనే వున్నారు. తాజాగా ఇద్దరు యువకులు కొండ చిలువను మెడలో వేసుకుని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టారు. దాన్ని మాంచి రేటుకు అమ్మేందుకు  బేరసారాలు కూడా చేశారు. సమాచారం అందుకున్న అధికారులు వారిని పట్టుకుని కటకటాల వెనకకు నెట్టారు.

ఈ ఘటన మేడ్చల్ జిల్లా చౌదర్‌గూడ గ్రామంలో చోటు చేసుకుంది. వెంకటాద్రి టౌన్‌షిప్‌లో శరణ్ మోసెస్ అనే యువకుడు నెల రోజుల నుంచి ఓ ఇంట్లో కొండచిలువ,  బ్రోంజ్ బ్యాక్ స్నేక్‌లను దాచి వుంచాడు. అదే ప్రాంతానికి చెందిన అతని స్నేహితుడు ప్రవీణ్ ఇటీవల వాటితో కొన్ని ఫోటోలు దిగి ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో షేర్ చేసి, వాటిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు.

దీనిపై పక్కా సమాచారం అందుకున్న అధికారులు ఆ ఇంటిపై దాడులు చేసి వారు పాములను అక్రమంగా అమ్ముతున్నట్టు గుర్తించారు. రెండు పాములను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేశారు అధికారులు. ఇద్దరినీ రంగారెడ్డి మెట్రో పాలిటిన్ జడ్జి ఎదుట ఇద్దరు హాజరు పరిచారు. ఈ అటవీ చట్టం ప్రకారం కొండ చిలువలను అక్రమంగా నిర్బంధించడం నేరం. అందుకు 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10,000వేల జరిమాన విధించే అవకాశం ఉంది.

Telugu news  Two guys try to Sale python, Bronze back snake in medchal