డబుల్ జీతం.. అంతలోనే మాయం! - MicTv.in - Telugu News
mictv telugu

డబుల్ జీతం.. అంతలోనే మాయం!

November 2, 2017

అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు కొందరికి ఆనందాన్నిస్తాయి. కొందరిని బాధపెడతాయి. అచ్చం అలాగే జరిగింది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి వాళ్ళు చేసిన పని. ఇంతకీ వీరు చేసిన పనేంటంటే..

https://www.facebook.com/mictv.in/videos/361756374282873/

నెలనెలా 1వ తేదీన 1200 మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను వారి వారి ఖాతాల్లో జమ చేస్తుంది ఈ బ్రాంచి . అయితే వీళ్ళు 300 మంది టీచర్లకు జీతాలను రెండుసార్లు వేశారు. మంచాల, యాచారం, మాడ్గుల, ఇబ్రహీం పట్నంలకు చెందిన టీచర్లందరికీ రెండింతల జీతం అకౌంట్లో పడింది. నెలనెలా తక్కువగా వచ్చే జీతంతో ఈ నెల ఏరియర్స్ కలిపి వచ్చాయేమో అనుకొని డ్రా చేసి అప్పులు తీర్చుకున్నారు కొందరు. కొందరేమో ఎంచక్కా ఎప్పట్నుంచో కొనాలనుకుంటున్న కొన్ని వస్తువులను కొనుక్కున్నారు. కొందరలా అకౌంట్లలో వున్న డబ్బులను చూసుకొని పైసా ఖర్చు చెయ్యకుండా మురిసిపోయారు. అంతలోనే అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయి. కొందరి అకౌంట్లలోంచి డబ్బులు మాయమయ్యాయి. అందరూ ఇది ఎవరైనా హ్యాకర్ల పనా అనుకొన్నారు. వెంటనే ఖాతాదారులందరూ బాధతో అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎందుకిలా జరిగిందని పోలీసులు ఆరా తీస్తే.. అది బ్యాంకు వాళ్ళే చేశారని తెలిసింది. ఎందుకిలా చేశారంటే.. పొరపాటున రెండు నెలల జీతం పడిందని వివరణ ఇచ్చారు. ప్రభుత్వమేమీ రెండు నెలల జీతం ఇవ్వలేదని, ఏరియర్స్ ఏమీ పెంచలేదని చెప్పారు. అసలు విషయం తెలుసుకొని ఉసూరుమన్నారు ఉద్యోగస్తులందరూ.