నిర్మల్‌లో ఇద్దరి దారుణహత్య - MicTv.in - Telugu News
mictv telugu

నిర్మల్‌లో ఇద్దరి దారుణహత్య

December 7, 2018

నిర్మల్ జిల్లాలో రెండు హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గడ్డివాములో నిద్రించిన ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా రోకలిబండతో తలపై మోది హత్య చేశారు. ఎవరు? ఎందుకు ఈ హత్య చేశారన్నది తెలిసిరాలేదు. పెంబి మండలం పస్పుల పంచాయతీ పరిధిలోని కొలాంగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మండలంలోని రేవోజిపేట్ గ్రామానికి చెందిన లింగంపల్లి భీమరాజు (29)  చికెన్ సెంటర్ నడిపిస్తూ  జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గౌరిని వివాహం చేసుకుని అత్తగారి ఇంటివద్దే ఉంటున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఎప్పటిలానే ఆరోజు కూడా చికెన్ షాపుకు వెళ్లాడు. రాత్రి పనులు ముగించుకుని, ఇంటికొచ్చి నిద్రపోయాడు. అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులుఅతని తల మీద రోకలిబండతో మోది చంపేశారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు నిద్రలేచి చూడగా భీమరాజు రక్తపు మడుగులో శవమై కనిపించాడు.

Telugu news  two people killed in nirmal district of telangana with old feuds

పాతకక్షలతో మరో హత్య..

పెంబి మండలం పస్పుల పంచాయతీ పరిధిలోని కొలాంగూడలో చీకటి గంగరాం(55) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. పాత కక్ష్యల కారణంగానే ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది.  కొలాంగూడకు చెందిన  టేకం తుకారాం, మృతుడికి వరుసకు బావమరిది అవుతాడు. వీరిమధ్య గత కొంతకాలంగా పాత కక్షలు ఉన్నాయి. బుధవారం సాయంత్రం పొలం నుంచి ఇంటికి వస్తున్నప్పుడు వీరి మధ్య గొడవ జరిగింది.  గంగారాం కోపంతో రాయి తీసుకుని తుకారాంను కొట్టాడు. తుకారాం గొడ్డలి తీసుకుని గంగారాం మీద దాడికి దిగాడు. విచక్షణా రహితంగా నరికాడు. తీవ్ర రక్తస్రావమైన గంగారాం అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య పద్మ, ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతణ్ణి పట్టుకుంటామని అంటున్నారు.

Telugu news  two people killed in nirmal district of telangana with old feuds