mictv telugu

ముగ్గు వేస్తున్న యువతి కిడ్నాప్‌కు యత్నం

January 14, 2019

 పండగ రోజున దారుణం జరిగింది. పండగ రోజున తెల్లవారుజామున ఇంటి ముందు ముగ్గు వేస్తున్న ఓ యువతిని కొందరు దుండగులు కిడ్నాప్ చేయడానికి యత్నించారు. గుంటూరు జిల్లా బాపట్లలోని కోళ్లమూడివారి వీధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే యువతి సోదరి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై.. పారిపోతున్న దుండగులను వెంబడించారు.

యువకుల్లో ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పండగ రోజున ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఆ కుటంబసభ్యులకు ఎంతో ఆవేదన మిగిల్చింది. యువతిని కిడ్నాప్ చేసే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పారిపోయిన మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 Telugu News two people try to kidnap a girl on festive day in andhra pradesh