నల్లటి కుర్తాలతో న్యూఢిల్లీలోకి ఉగ్రవాదులు…ఫోటో విడుదల చేసిన పోలీసులు... - MicTv.in - Telugu News
mictv telugu

నల్లటి కుర్తాలతో న్యూఢిల్లీలోకి ఉగ్రవాదులు…ఫోటో విడుదల చేసిన పోలీసులు…

November 21, 2018

నల్లటి కుర్తాలు ధరించిన ఇద్దరు ఉగ్రవాదులు న్యూఢిల్లీలోకి ప్రవేశించారని అందరూ జాగ్రత్తగా వుండాలని.. వారు ఎక్కడైనా కనిపిస్తే 011-23520787 లేదా 011-2352474 ఫోన్ నంబర్లకు కాల్ చేసి చెప్పాలని పోలీసులు కోరారు. వారు ఏ క్షణమైనా ఉగ్రదాడికి పాల్పడవచ్చని హెచ్చరికలు జారీ చేస్తూ, వారిద్దరి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. వీరి పోలికలతో ఎవరైనా తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.Telugu news Two terrorists in New Delhi with black kurtas ... Police released by photo.ఈ ఫోటోలో వారిద్దరు ఢిల్లీకి 360 కిలోమీటర్లు, ఫిరోజ్ పూర్‌కు 9 కిలోమీటర్ల దూరంలో వున్న ఓ మైలురాయి వద్ద ఉన్నారు. ఇద్దరు యువకులు నల్లటి కుర్తాలు ధరించారు. ఫిరోజ్ పూర్ పట్టణం పంజాబ్‌లోని ఇండియా – పాకిస్థాన్ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉంది. కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు ఈ ప్రకటన విడుదల చేశారు. గత వారంలో జైషే మొహమ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు ఢిల్లీ దిశగా కదులుతున్నట్టు సమాచారం వుండటంతో పంజాబ్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే.