తెలంగాణ హద్దులో నెత్తురు.. ఇద్దరు మహిళా నక్సల్స్ మృతి

తెలంగాణ సరిహద్దులోని మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఈ ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. గడ్చిరోలికి చెందిన సీ60 బెటాలియన్ సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి.Telugu news Two women Naxals killed in encounter with police in Maharashtra ధానోరా తాలూకలోని నిహాల్కాయ్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నారని ఇన్ఫార్మర్ల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని వారిపై కాల్పులు జరిపారు. మావోయిస్టులు కూడా కాల్పులు కొనసాగించారు. సంఘటన తర్వాత ఆ ప్రాంతంలో వెతకగా ఇద్దరు మహిళా నక్సల్స్ మృతదేహాలు కనిపించాయి. తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. అటు ఛత్తీస్‌గఢ్, ఇటు మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలో వరుసగా ఎన్ కౌంటర్లు సాగుతుండడంతో తెలంగాణ ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఈసీ చెబుతోంది.