mictv telugu

భారతీయులను బోనులో పెట్టి.. అరబ్ షేక్ దుర్మార్గం

January 12, 2019

పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న భారతీయులు ధనంతో బలిసిన అరబ్ షేకుల చేతుల్లో దారుణ హింసకు, అవమానాలకు గురవుతున్నాయి. ఆడవారిపై ఘోరాలకు లెక్కలేకుండా పోతోంది. మగవారిపైనా అకృత్యాలు సాగుతున్నాయి. అరబ్ షేక్ ఒకడు భారతీయులను పక్షుల పంజరంలో బంధించి బెత్తంతో  బెదిరిస్తూ తిడుతున్న దృశ్యాలు పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి.Telugu news UAE Man Arrested For Locking Up Indian Football Fans In "Bird Cage": Report. Watch Videoబంధితులు ఏ తప్పూ చేయలేదు. గురువారం భారత్, యూఏఈల మధ్య జరిగిన ఏఎఫ్సీ ఆసియన్ కప్ ఫుట్ బాల్ మ్యాచ్ ఈ షేక్ ఉన్మాదానికి కారణం. మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. మ్యాచ్ ముందు ఈ షేక్ తన వద్ద పనిచేస్తున్న భారతీయులను బంధించాడు. ‘మ్యాచ్‌లో మీరు ఏ దేశానికి మద్దతు ఇస్తారు?’ అని అడిగాడు.  వారు ఏమాత్రం తొణక్కుండా భారత్‌కు జైకొడతామని చెప్పారు. దీనికి అతడు రెచ్చిపోయి బూతులు తిట్టాడు. దీంతో వారు యూఏఈకి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ తతంగాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. విషయం పోలీసులకు చేరడంతో  షేక్ ను అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. వివక్ష, హింస తదితర నేరాల కింద విచారిస్తున్నారు. తాను కేవలం సరదాకు అలా చేశానని షేక్ బొంకాడు.Telugu news UAE Man Arrested For Locking Up Indian Football Fans In “Bird Cage”: Report. Watch Video