ఉబర్, ఓలాలో ప్రయాణించే ప్రయాణికులకు చేదు వార్త. మరో 15శాతం చార్జీలు పెంచుతున్నట్లు క్యాబ్స్ సలహా సంస్థ రెడ్ సీర్ ప్రకటించింది. గతేడాదే 10శాతం చార్జీలు పెంచిన ఉబర్, ఓలా ఇప్పుడు మళ్లీ చార్జీలు పెంచుతోంది. వివిధ నగరాలను బట్టి చార్జీలు మారుతాయని తెలిపింది. డ్రైవర్లకు ప్రోత్సహకాలు ఇచ్చేందుకే ధరలు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ధరల పెంపుతో డ్రైవర్లకు రైడ్ మొత్తాన్ని రూ.190 నుంచి రూ.220కి పెంచుతున్నట్లు తెలిపింది.
ఢిల్లీ, ముంబై నగరాల్లో క్యాబ్ డ్రైవర్లు సమ్మెకు దిగడంతో వారికి ప్రోత్సహకాలు కల్పించేందుకు చార్జీలు పెంచామని క్యాబ్ సర్వీసుల నిర్వాహకులు పేర్కొన్నారు. పెరిగిన ఇంధన ధరలు, పెరిగిన నిర్వహణ వ్యయం వల్ల చార్జీలు పెంచినట్లు తెలుస్తోంది. ఉబర్, ఓలా ట్యాక్సీల్లో రోజుకు 35లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు.