అంబానీ కూతురి పెళ్లికి 200 విమానాలు..

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ-నీతా అంబానీ కుమార్తె ఈశాకు పిరమల్ ఆనంద్‌కు ఈనెల 12న అంగరంగా వైభవంగా పెళ్లి జరగనుంది. ఇందుకోసం ముంబైలోని ‘ఆంటిల్లా’లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంబానీ ఇంట పెళ్ళి బాజాలు అంటే మాములు అరెంజ్‌మెంట్స్ ఉంటాయా.?  అనుకుంటున్నట్లు‌గానే నిశ్చితార్థం తర్వాత ఇటు అంబానీ, అటు పిరమల్ కుటుంబ సభ్యులు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందుకు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ వేదిక కానుంది.

అంబానీ ఫ్యామిలీ కోసం 30 నుంచి 50 చార్టర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఉపయోగిస్తున్నారు. మాములురోజుల్లో అయితే ఉదయ్ పూర్‌లోని మహారాణా ప్రతాప్ ఎయిర్‌పోర్ట్‌లో రోజుకు 19 విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. కానీ ఎన్నికల ఎఫెక్ట్, అంబానీ కూతురి ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్ కోసం ఆ విమానాశ్రయం ఫుల్ బీజీ అయిపోనుంది. మరో మూడు రోజుల్లో ఏకంగా 200 విమానాలు అక్కడికి రాకపోకలు సాగించనున్నాయి.

ఇప్పటికే ఉదయ్‌పూర్‌లోని ఫైర్ స్టార్ హోటళ్లను బుక్ చేశారు. ఇషా పెళ్లి వేడుకలను సెలబ్రిటీ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ చిత్రీకరించనున్నాడు. ఇప్పటికే ప్రియాంక-నిక్, అనుష్క-విరాట్‌ల పెళ్లి వీడియోలు, ఫొటోలు రాధిక్ తన కెమెరాలో క్లిక్ మనిపించాడు.  ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తర్వాత ముంబైలో నాలుగు రోజులపాటు అంబానీ కూతురి పెళ్లి ఘనంగా జరగనుంది.