ఉదిత్ నారాయణ్ కొడుకు అరెస్టు - MicTv.in - Telugu News
mictv telugu

ఉదిత్ నారాయణ్ కొడుకు అరెస్టు

March 13, 2018

ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి ఆదిత్య నారాయణ్ తన కారుతో ఓ ఆటోను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్, అందులో ప్రయాణిస్తున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.దాంతో వారు ఆదిత్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సెక్షన్ 338, 279 కింద  కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆదిత్య గాయకుడిగానే కాకుండా కొన్ని షోలకు వ్యాఖ్యతగా. నటుడిగా కూడా రాణిస్తున్నాడు. ఆదిత్య దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. ఇటీవల రాయ్‌పూర్ ఎయిర్ పోర్టులో తాము పలుకుబడి ఉన్న మనిషిని అని సిబ్బందితో గొడవపెట్టుకున్నాడు.